Hosuru-words

హోసూరు పదకోశం

(అగరం వసంత్, హోసూరు)

  • మన్నాడు : ఎల్లుండి
  • తూకము : బరువు
  • యాగిటీ : గర్భిణీ
  • బిందిగ : బిందె
  • మానుపలక : కొయ్యపలక
  • నవ్వ : దురద
  • మలుగు : మందు
  • గుడుగు : ఉరుము
  • మించు : మెరుపు
  • పొరువు : సంతర్పణ / అన్నదానం
  • సీతనాకు : దురదగొండి ఆకు
  • తడిసేకి : తట్టుకోవడానికి
  • మబ్బు మసకలు : చీకటి మసకలు
  • అవిట్లా : వాటిలో
  • తిప్ప : పేడకప్పు
  • కడ్డి : పుల్ల
  • మూళ్ళిల్లు : వంటగది
  • నీళ్ళిల్లు : స్నానాల గది
  • కింబారే : ఎర్రబారే
  • తుండుము : పొలంలో భాగం
  • సీమనూనె : కిరసనాయలు
  • అవిటికి = వాటికి
  • బాడిక్కి = అద్దెకి
  • మాడీలు = మిద్దెలు
  • వరటు = మొరటు
  • మిచ్చము = మిగతా
  • ఉదురు = రాలు
  • మెయిళ్ళు = మేఘాలు
  • టెంకాయ గరి = కొబ్బరి మట్ట
  • గమ్ములు = వాసన
  • ఉజ్జు = రుద్దు
  • ఎన్నము = మనస్సు
  • గొజ్జు = పచ్చిపులుసు
  • దుడిసింది = చాకిరి చేసింది
  • యాజ్యం = తగువు
  • తానే = కదా
  • తొగురు = వగరు
  • మీజు = ఈత