To add a new yaasa word please hit the + sign below.

కోస్తా

 అర్థం:ముందు

ఉదాహరణ: కారులో చిన్నది ఎదర కూర్చుంటది.

ప్రాంతాలు:


సహకారి: Prakash 20250127
 అర్థం:అలంకారం, వేషం, వస్త్రధారణను ఉద్దేశించి వ్యంగ్యార్థంలో వాడే పదం

ఉదాహరణ: "బుడబుక్కల వాడిలా ఈ అవతారం ఏంట్రా?!"
"ఈ అవతారంలో నిన్ను చూస్తే పెళ్ళికూతురు పారిపోతుంది. కొంచెం అందంగా రెడీ అవ్వు."

ప్రాంతాలు:


tags:


సహకారి: Sai Kumar 20250123
 అర్థం:వాడుకలో లక్ష్మీవారాన్ని లక్షివారం అని పలుకుతారు, గురువారం.

ఉదాహరణ: "పోయిన లక్షివారం చెప్పాను డబ్బులు ఇమ్మని వాడికి, ఇంకా ఇవ్వలేదు."

ప్రాంతాలు:


సహకారి: Sai Kumar 20250123
 అర్థం:గురువారం
మాట్లాడేటప్పుడు లక్షివారం అని అంటుంటారు

పుట్టుక: గురుగ్రహం పేరు మీద గురువారం అనే పేరు వచ్చింది. గురువు బుద్ధి, సంపద మొదలైనవి ఇచ్చే దేవుడు.  హిందూ సంప్రదాయం ప్రకారం ఒక్కో వారం ఒక్కో దేవతని పూజించడం వల్ల విశిష్టమైన గుణాలు కలుగుతాయని నమ్ముతారు. లక్ష్మీదేవి కూడా సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం కటాక్షించే దేవత. గురువారం నాడు లక్ష్మీదేవిని పూజించడం వలన అవి సిద్ధిస్తాయని నమ్మకం. అందుకే గురువారాన్ని లక్ష్మీవారం అంటారు. గోదావరి, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ పదం విస్తృతంగా వాడుకలో ఉంది.

ఉదాహరణ: ఈ లక్షివారం బ్యాంకు సెలవంట. బుధవారం డబ్బులు వేసెయ్యాలి.

ప్రాంతాలు:


సహకారి: Sai Kumar 20250123
 అర్థం:అల్లరి

ఉదాహరణ: "సదునెక్కువ అనుకుంట మీ పిల్లాడికి బాగా!"

ప్రాంతాలు:


సహకారి: Sai Kumar 20250123