చిత్తూరు యాస – మాటల్లోనే ఓ సంస్కృతి

Wed Jan 01 2025

చిత్తూరు జిల్లాలో తూర్పు ప్రాంతాల్లో యాస ఒకరకంగా, పడమర ప్రాంతాల్లో మరోలా ఉంటుంది.
‘ఆయన ఇప్పుడదా పూడ్సినాడు’ అంటూంటారు. ‘వెళ్లినాడు’ అనే అర్థంలో ‘పూడ్సినాడు’ అనే ప్రయోగం వినిపిస్తుంది.

పురోహితులను, ఉపాధ్యాయులను అయ్యోరు, ఉపాధ్యాయినులను అమ్మోరు అని పిలవడం విశేషం.
తండ్రి అన్నను పెదనాయన, తమ్ముణ్ని చిన్నాయనగా వ్యవహరిస్తారు.

తమిళ ప్రాబల్యమున్న ప్రాంతాల్లో బావమరిదిని మచ్చీ / మచ్చాగా అంటారు.
వృత్తినే పేరుతో కలిపి పిలవడం ఇక్కడి ప్రత్యేకత:

రోజువారీ వ్యవహారంలో వినిపించే మాటలు:

తిరుపతిని తిరప్తి, తిరుమలని కొండ / మలైగా వ్యవహరిస్తారు.

సమయ సూచనల్లో కూడా ప్రత్యేకత ఉంది:


మాకు తెల్సులే అబ్బీ

ఇళ్లకు వేసే తాళాన్ని బీగం అంటారు.
“ఇంటికి బీగాలు బాగా వేసినవా?” అని పెద్దవాళ్లు అడుగుతుంటారు.

ఎవరికైనా తెలిసిన విషయాన్ని మళ్లీ చెబితే
“ఆఁ… మాకు తెల్సులే అబ్బీ” అని ఆటపట్టిస్తారు.

వారుకొన్నాడు అంటే బాగా సంపాదించాడని అర్థం.
“వెంకటముని చిల్లరంగడి పెట్టి బాగా వారుకొన్నాడు” అనే వాక్యం తరచూ వినిపిస్తుంది.

ఇక్కడ వినిపించే సరదా సామెతలు:


ఇంటి కాడ, బాయి కాడ, చేను కాడ

‘దగ్గర’కు బదులుగా కాడ అనే మాట వినిపిస్తుంది.
“బాయి కాడున్నాడు” అంటే బావి దగ్గర ఉన్నాడని అర్థం.

భర్తను ఇంటాయనగా వ్యవహరిస్తారు.
“ఏమ్మేయ్ బుజ్జీ మీ ఇంటాయన వచ్చాడు” అన్న ఆప్యాయత మాటల్లోనే కనిపిస్తుంది.

‘ఎక్కడ’కి బదులుగా యాడ అనే పదం విరివిగా వినిపిస్తుంది.


తమిళం, కన్నడ ప్రభావం

తమిళనాడుకు సరిహద్దు కావడంతో చాలా తమిళ పదాలు తెలుగులో కలిసిపోయాయి:

  • వరుమానం (జీతం)
  • వేళకారు (ఉద్యోగి)
  • తెరువు (వీధి)
  • పెరుమాళ్ (వేంకటేశ్వరుడు)
  • అన్నాచ్చి, అని, చిత్తప్ప

“ఎన్నబా ఎన్న సమాచారం” అంటే
“ఏంబా సంగతులేంటి” అనే అర్థం.

కొన్ని ప్రాంతాల్లో కన్నడ ప్రభావం కూడా ఉంటుంది:

  • చెన్నగిదిర (ఎలా ఉన్నావు)
  • బేడు (వద్దు)
  • బేకు (కావాలి)
  • వూటా అయిత్తా (భోజనం చేశావా)

ఎన్ని భాషల ప్రభావాలున్నా,
తనదైన సొగసును కోల్పోని అమ్మభాషే చిత్తూరు తెలుగు.

మధురాంతకం రాజారాం, కేశవరెడ్డి, నామిని వంటి రచయితల రచనల్లో ఈ యాస గుబాళిస్తుంది.
భాషాధ్యయన కోణంలో చూస్తే, చిత్తూరు జిల్లా నిజంగా ఓ విలక్షణ ప్రాంతం.

చివరగా సరదాగా చెప్పే మాట:

గోల గోవిందరాజులుది, ముడుపులు వెంకటేశులువి