kadapa

కడప: దేవుని గడప — పంచదార పలుకులు

కలమళ్లలో శిలాక్షరమైన ప్రాచీన తెలుగు… తాళ్లపాకలో జ్ఞానపథమైన జానపద తెలుగు… అంతా ఆ వసుధ వెలుగే!
పెద్దన జిగిబిగి అల్లికలు… వేమన ఉపమానాలు… అన్నీ ఆ మట్టి మెరుపులే!
ఒంటిమిట్ట కోదండరాముడు… నందలూరు బుద్ధుడు… దానవులపాడు తీర్థంకరుడు… అందరూ ఆ నేల వేల్పులే!

బ్రహ్మం గారి మఠం… గండికోట దుర్గం… పుష్పగిరి ఆలయ సముదాయం… ‘సురభి’ నాటకం… బ్రౌను గ్రంథాలయం…
అన్నీ జాతి వారసత్వ సంపదలే! అది కడప… దేవుని గడప!!
అక్కడి ప్రజల తెలుగు పలుకులు… పంచదార పలుకులు.


“దేహళిపుర” = కడప?

‘దేహళిపుర’ పేరు విన్నారా? వేదాంత దేశికుల ‘మాట’ ప్రకారం అదే కడప.

  • దేహళి అంటే గడప
  • తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లే భక్తులు… ‘దేవుని గడప’లో ఉన్న ఆయన ప్రతిరూపాన్ని సందర్శించుకుని వెళ్లడం అప్పట్లో ఆనవాయితి
  • అందుకే ఈ ప్రాంతం తిరుమలకు తొలిగడప అయింది
  • గడపే క్రమేణా కడపగా మారిందంటారు

‘దేవుని గడప’లోని వేంకటేశ్వరుడి విగ్రహాన్ని కృపాచార్యులు ప్రతిష్ఠించారు. దాంతో ఈ ప్రాంతం కృపానగరం అయింది.
ఈ ‘కృప’లోంచే ‘కరిగె, కరిపె’ పేర్లు పుట్టి, చివరికి అవి కడపగా మారాయన్నది మరో వాదన.

క్రీ.శ. రెండో శతాబ్దంలో ఇక్కడ పర్యటించిన టాలమీ తన గ్రంథంలో ఈ ప్రాంతాన్ని ‘కరిగె/కరిపె’గా పేర్కొన్నాడు.
ఏది ఏమైనా… అన్నమాచార్యుల కాలానికే ఇది కడపగా స్థిరపడిపోయింది.

“కాదనకు నా మాట కడపరాయ/ నీకు గాదె బోసె వలపులు కడపరాయ”


రాయలసీమలో “స్వతంత్ర” భాష

రాయలసీమలోని మిగిలిన జిల్లాలైన అనంతపురం, కర్నూలు, చిత్తూరు… వీటి భాష, ఆచార వ్యవహారాల్లో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణల ప్రభావం కనిపిస్తుంది.
కడప జిల్లా మాత్రం దీనికి అతీతం. ఇక్కడి భాష, ఆచార వ్యవహారాలన్నీ నాటి నుంచి నేటివరకూ స్వతంత్రం’గా మనగలుగుతున్నాయి.

అయితే కొద్దికాలం ‘మయానా నవాబు’ల పరిపాలనలో ఉండటం వల్ల కడప తెలుగులో కొన్ని ఉర్దూ పదాలు కలిసిపోయాయి.


ఉర్దూ–కడప “దోస్తీ”: ఉదాహరణలు

వాడుకలో ఉండే వాక్యాలు:

  • లడాయికి పోయి కొంప మీదకు తెచ్చుకున్నాడు
  • వానితో పెద్ద తకరారుగా ఉంది
  • పది ఎకరాల జమాబంది మొత్తం ఇచ్చాడా?
  • ఎవరి ఇలాకారా అబ్బీ?

పదాలు:

  • లడాయి (గొడవ)
  • తకరారు (వాదులాట)
  • జమాబంది (పన్ను)
  • ఇలాకా (సంబంధం)
  • కస్బా/కసుబా (పెద్దస్థలం)
  • కట్టవ (ఆనకట్ట)
  • కర్బారు (వ్యవసాయం)

తెలుగులో తియ్యందనం: ఉచ్చారణ విశేషాలు

“వచ్చాన్యాడా?” / “వచ్చిండాల్నే!”

“ల్యా” = “లేదు”

పూర్ణస్వర చేర్పు

  • ఇక → ఇంక
    • “ఇంక పాండ్రా పోదాం”
    • “ఆలస్యం అయ్యింది ఇంక పారా పోదాం”

పాండి / పాండ్రా = “పదండి / పదండ్రా”
పదరాపారా


కడప పదాలు: తినుబడి – భావాలు – పలుకులు

మాసులు : మనుషులు వలపక్రం : పక్షపాతం చియ్యలు : మాంసం ముక్కలు లంకించుకుంది : వచ్చింది సెరవ : వంట పాత్ర మెరవణి : ఊరేగింపు జాంకులు : ప్రతిసారీ రంపుచేసి : గొడవ చేసి కొండబో : తీసుకెళ్ళు తొక్కులాడటం : తొందరపడటం కొతుకు : కొరత తాలిచూడు : ఆగిచూడు సగిరిపొద్దు : సూర్యాస్తమయం సావుజంపుల్తో : అతికష్టం మీద బంగపోవడం : బతిమిలాడటం మురుగుడ్లు : చెడిపోయిన కోడిగుడ్లు వొలకల్లోకి :శ్మశానంలోకి లగుసుకున్నాడు : ఆరంభించాడు

పుల్లిక : అలసట ఉరువూ : బొత్తిగా పలాస్తరం : జీవనాధారం కోసం వలసపోవడం

ఆహారం

మాటల్లో మాధుర్యం

  • “నువ్వు వూరకే అర్సాకు” → అరవకు
  • కచ్చి → కక్ష
    • “నీతో కచ్చి” అని అంటూనే “ఖా…” అనే శబ్దం చేసి ‘నీతో ఇక స్నేహం లేదు’ అని గట్టిగా చెప్తారు

సాధారణ ప్రయోగాలు


కడపలో మాత్రమే: కుటుంబపదాలు – ప్రాంత భేదాలు

ఇతర ప్రత్యేకాలు


ఇళ్ల పేర్లు – నిర్మాణ పదాలు

  • ఎత్తైన భవనాలు = మాడీ (మేడ → మాడీ)
  • తలుపులు తెరవకుండా అడ్డంగా అమర్చే పెద్ద కొయ్య = గడిమాను
    • మూలం: గడియమాను (గడియలాగా ఏర్పాటు)
    • దీంట్లోంచే గడిమాను, గెడె… తదితర పదాలు వచ్చాయి

కడప సామెతలు (లోకోక్తులు)


ఆంగ్ల మాటలకు బదులుగా (స్థానిక పదాలు)


“అల్పాక్షరాల్లో అనల్పార్థాలు”: పదాలు–పదబంధాలు