సిక్కోలుు
పలకరింపుల సంగీతం
మా ఊరెళ్లినపుడు పలకరింపులే పులకరింప జేస్తాయి.
“ఓహో బాబు! ఎప్పుడు రాక?” "ఏవండీ బాబు నువ్వెక్కడుం తన్నావిప్పుడు?" - ఇక్కడ "నువ్వు" అంటే మీరు అని అర్థం.
ఈ పలకరింపులో ఆప్యాయతతో కూడిన సంగీతం ఉంటుంది.
మాండలిక పదాలు – అర్థాలు
ఉదాహరణ
“ఓలమ్మ గుంటడికి బేపొచ్చి బీపంతా బక్రీసిందే”
- బేపి → కుక్క
- బీపి → వీపు
- బక్రీడమంటే → గీరటం
సంబంధ పదాలు
“అమ్మీ మీ పెనిమిటి ఇంటి కాడున్నాడమ్మా”
- పెనిమిటి → భర్త
- మూలం: పెనుపు + మేటి (పెంచువాడు)
స్వభావ సూచనలు
- ఆడికేటా గీర్మానము → అవతలవాడి పొగరు -> "గీర్వాణ" పదంలో నుంచి పుట్టిందై ఉండాలి.
- ఆడికేటా గర్ర → వాడికేంటా గర్వమని
- ఏటీడి గోతాలు -> కోతలు అనే పదానికి వికృతి గోతాలు.
- ఆడితోనేటిరా నీకు, ఉల్లీ కాడూ వసాకాడూ -> దేనికీ పనికిరాని వాణ్నీ ఇలా అంటూ ఉంటారు.
- ఏటాడి గోరోజనవు -> ఏమిటి వాడిగొప్పతనం
- నీలుగు -> అనే పదం వాడకంలో ఉంది. ‘‘ఏట్రా నీలుగుతున్నావు’’ అని తరచుగా అంటూ ఉంటారు.
- సాటవ -> పోలిక
- ఓగాయిత్తం -> అఘాయిత్యం ->
- ఖరాఖండీ → ముక్కుసూటిగా
- ఒల్లుపోత్రం → అడ్డగోలు ప్రవర్తన
- ఊష్టం -> జ్వరం
- ఉడుకు -> వేడి -> సలేస్తంది కదా ఉడుకునీలు పోసుకో బాబూ
శబ్ద జనిత పదాలు
Onomatopoeia ప్రభావం (క్రొ, బ్రే, మ్యూ, కుకూ మొదలైనవి).
ఆంగ్ల రూపాంతరాలు
“నువ్వేటి గయినేరు గుంపువండీ?” -> ఎవరన్నా డాంబికం ప్రదర్శిస్తే
ఊరు – దేశం భావం
“మా దేశం వెళ్తాన్నావమ్మా”
ఇక్కడ దేశం = సొంతూరు.
విజయవాడ వాళ్లకి పరాయి దేశం.
వ్యవసాయ పదాలు
- బాబు అల్లాగుంట గెడ్డలోన పడిపోనాది → ఆ పిల్ల కాలువలో పడిపోయింది.
- మా అయ్య గుడ్డికాడ కెల్లినాడు
- గుడ్డి → పొలం
- మాయమ్మ బుగతోరింటికి పనికెల్లినాది -> ఈ పదం ‘‘భుక్త’’ అంటే భోజనం పెట్టేవాడు అనే శబ్దంలో నుంచి పుట్టింది.
- బుగత → భూస్వామి
- మూలం: భుక్త (భోజనం పెట్టేవాడు)
శృతి ఆధారిత అర్థాలు
“అలాగే” అనే పదం:
- మంద్ర స్థాయి → తప్పకుండా
- మధ్యమ స్థాయి → చూసుకుందాం
- తార స్థాయి → నువ్వేం చేసుకుంటావో చేసుకో
- సంకోచంగా పలికితే ‘‘నిజమా’’
- కోపంగా అంటే ‘‘ఎందుకలా చేశాడు’’
ఆహార పదాలు
పూర్వం తెల్లవారుఝామున పకాలి తిని పొలాలకు బయలుదేరేవారు.
నిద్ర & ఇతర పదాలు
- తొంగో → నిద్రపో
- కుట్టె → మగ పిల్లాడు
- వెర్రి కుట్టె → మూర్ఖుడు
భావవ్యత్యాస పదాలు
“చితక్కొట్టీసాడు”
- ఆశ్చర్యార్థకంగా → అద్భుతం
- విసుగ్గా → బోరు
సంస్కృత రూపాంతరాలు
- విధము → ఇదము
- పథము → పదము
“ఆడు ఇదమూ పదమూ లేని మనిసిరా”
