vijayanagaram

విజయనగరం

భౌగోళిక – చారిత్రక నేపథ్యం

తెలుగునాడుకు ఉత్తర సరిహద్దులో, తూర్పుతీరపు అంచున… అటు ఒడిశా, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వారధిలా ఉంటుంది విజయనగరం జిల్లా.
అనేక భాషల సంగమం ఈ ప్రాంతం. విజయనగరం – పార్వతీపురం గ్రామ్యాల మధ్య స్పష్టమైన భేదాలున్నాయి. ---

భాషల ప్రభావం

జిల్లా ఉత్తర, పశ్చిమ ప్రాంతమంతా పర్వతమయం. గిరిజనులు ఎక్కువ.
ఒకప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్ర పాలనలో ఒడిశాలోని గంజాం ప్రాంతం వరకూ ఈ ప్రాంతానికి సంబంధం ఉండేది.

తెలుగు, ఒడియా సంస్కృతులతో పాటు హిందీ భాషా ప్రభావమూ విజయనగరం తెలుగుపై బలంగా ఉంది.
మధ్యప్రదేశ్ (ఇప్పటి ఛత్తీస్‌గఢ్) ప్రాంతాల నుంచి వ్యాపారం నిమిత్తం వచ్చిన ప్రజల ద్వారా హిందీ ప్రభావం ఏర్పడింది.

సాగతీతగానీ, తెగవేతగానీ లేకుండా పూర్తి పదాన్ని ఉచ్చరించడం ఈ జిల్లా ప్రత్యేకత. అంతేకాదు పదోచ్చారణ స్పష్టంగా ఉంటుంది. గ్రామీణభాషలో ‘ము’ వర్ణకాంత ప్రయోగాలు ఎక్కువ. ఉదాహరణకు ‘చేద్దాము’- సేతుము; చూద్దాము- సూతము; విందాము- విందము, ఉందాము- ఉందుము లాంటివి.

ఉదాహరణలు:


భలే భలే మాటలు

వివిధ భాషల సంపర్కంతో తయారైన మాటలు ఇక్కడ కొల్లలు.


ఊళ్ల పేర్ల వెనుక కథలు

ప్రతి ఊరి పేరువెనక ఒక విశేషమే.


వ్యవసాయం – జీవనశైలి

నాగావళి, వేగావతి, సువర్ణముఖి, చంపావతి, గోస్తని, జంఝావతి వంటి నదులు ఉన్నా, వ్యవసాయం ఎక్కువగా వర్షాధారమే.
తిండికి లోటుండదు, కాని అమ్ముకుని సంపాదించుకునేంత మిగులు ఉండదు.

ఈ ప్రాంతానికి గోదావరి సీమ నుంచి ద్రావిడ బ్రాహ్మణ కుటుంబాలు వలస వచ్చి అగ్రహారాలు ఏర్పాటుచేశాయి. అగ్రహారాలను ఏర్పాటు చేసుకున్నాయి. తమిళనాడుకు చెందిన ఈ శాఖీయులు మొదట గోదావరీ పరీవాహక ప్రాంతంలో స్థిరపడ్డారు. గోదావరి నదిమీద ఆనకట్ట లేని సమయంలో ప్రబలిన కరవుకు తట్టుకోలేక, వాళ్లలో కొందరు ఈ ప్రాంతానికి వచ్చారన్నది చరిత్ర కథనం.

ప్రసిద్ధ అగ్రహారాలు:
కృష్ణరాయపురం, అజ్జాడ, కలవరాయి, లోగిశ, సుంకి, చాకరాపల్లి, చల్లపేట…
వెలనాటి బ్రాహ్మణుల అగ్రహారాలు: వెంగాపురం, కుసుమూరు, నందబలగ, శివరాంపురం…


ఒకే అర్థం – రెండు మాటలు

| భావం | అగ్రహార భాష | గ్రామీణ భాష | |----|-------------|-------------| | ఎక్కువ | లావు | వింత | | కొంచెం | కాస్త | కసింత | | తొందరగా | వేరంగా | బేగి | | గోళీలు | గొట్టికాయలు | అల్లికాయలు | | సంతృప్తి | ఆటిపారు | గీటెక్కు | | ఇటువైపు | ఇసుంటా | ఇటింకా | | అత్యాశ | కాప్యానం| కాపీనం | | వచ్చేసెయ్‌ | ఒచ్చీ, వళపచ్చీ | ఎలిపొచ్చీ| | గోళీలు | గొట్టికాయలు | అల్లికాయలు | | వేళాకోళం | సరసాలు | ఇగటాలు |


ప్రాంతాల మధ్య తేడాలు

విజయనగరం – పార్వతీపురం గ్రామ్యాల మధ్య స్పష్టమైన భేదాలున్నాయి. దీనికి కారణం నాడు విజయనగరం తెలుగు రాజుల పాలనలో ఉంటే, పార్వతీపురం కళింగ రాజుల ఏలుబడిలో ఉండేది.


బహుఅర్థ పదాలు

ఒకే పదానికి రెండు మూడు అర్థాలు:


సాహిత్యం – ప్రజాభాష

ఆదిభట్ల వారు “సీమపలుకు వహి” అనే నిఘంటువు రూపొందించారు.

కొన్ని విజయనగరం మాటలు:

గురజాడ కన్యాశుల్కం ద్వారా విజయనగరం తెలుగుకు చెరగని ఖ్యాతిని తెచ్చారు.


ప్రజాసాహిత్యం

రైతాంగ ఉద్యమాల ప్రభావంతో ప్రజాసాహిత్యం విస్తరించింది.
భూషణం, వంగపండు వంటి కవులు ప్రజల భాషలోనే రచనలు చేశారు.

గ్రామ్య పదాలు:


ముగింపు

ప్రాచీనకాలం నుంచి నేటివరకూ అనేక రూపాంతరాలు చెందుతూ,
పండితులను – జానపదులను ఒకే బాటలో నడిపిస్తూ,
తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది విజయనగరం తెలుగు.