Type in English or తెలుగు

అడ్డవైతం

addavaitam addavaitam ఇతర రూపాలు: అద్దవైతం

అర్థం

అద్వైతం: అందరూ చేస్తున్న పని కాకుండా వేరేలా వ్యతిరేకంగా చేసినప్పుడు వాడేది

ఉదాహరణ

అంతా అద్దవైతం మనిషీడు. అందరూ ఈసారికి జొన్న ఏస్తే గిరాకీ ఉంటాది అని పండిస్తే ఈడు మాత్రం కాదని మినివులు ఏసాడు.. ఈసారి పడ్డ వర్షాలకి ఎందుకూ పనికిరాకుండా పోయాయ్!

పుట్టుక: దేశమంతా ద్వైత సిద్ధాంతాన్ని నమ్ముతున్నప్పుడు, శంకరాచార్యులు భగవంతుడు ప్రకృతి ఒకటే అని ఏక (అద్వైత) సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ప్రచారం చేశారు. జనులంతా ఒక మార్గంలో వెళుతున్నప్పుడు ఈయన వ్యతిరేకంగా వేరొక మార్గము ఎంచుకున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. నలుగురు ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి అది తప్పు అలా చేయను ఇలా చేస్తానని వేరొక పని లేదా మార్గాన్ని ఎంచుకున్నప్పుడు ఈ పదాన్ని వాడుతారు.

అడ్డవైతం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి