యతిమతం
yatimatam
In English: stubbornness, doing as one pleases — Ignoring what one is told and doing as one likes.
అర్థం
చెప్పిన మాట వినకుండా నచ్చినట్టు చేయడం. (కృష్ణ, గుంటూరులలో)
ఉదాహరణ
నానమ్మ: అన్నం తినమంటే ఎందుకు ఎతిమతం పోతావ్? మనవడు: తినాలని లేదు నానమ్మ!! బాబాయి: నువ్వన్నా చెప్పొచ్చు కదరా వాడికి? అబ్బాయి: చెప్తే వింటాడా బాబాయ్! ఎంత ఎతిమతంగా మట్లాడతాడు.
పుట్టుక: యతి(సన్యాసి) లాగ తనకి నచ్చిందే చేస్తాడు అని తిట్టడం.
యతిమతం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి