అర్థం:అ నుంచి హ వరకు తెలుగు అక్షరాలు.
పుట్టుక: తెలుగు ప్రాంతాల్లో చిన్నపిల్లల అక్షరాభ్యాసం అప్పుడు మొదటి సారిగా "ఓం నమః శివాయ సిద్దం నమః" అని దిద్దిస్తారు పరమశివుడిని, మన పూర్వం విద్య నేర్పిన జైన గురువులని తలుస్తూ. ఓం నమః తో మొదలుపెట్టడం వల్ల తెలుగు అక్షరాలకు ఓనమాలు అని పేరు వచ్చింది
ఉదాహరణ: తాతయ్య: దారా, పలక తెచ్చుకో ఓనమాలు దిద్దిస్తా.