అర్థం:గురువారం ( రాయలసీమ, తెలంగాణాలలో )
పుట్టుక: బృహస్పతి వారానికి తెలుగు రూపం బేస్తవారం. నవగ్రహాలలో దేవతల గురువైన బృహస్పతి గురు గ్రహం రూపం. ఆయన పేరు మీద గురువారం లేక బృహస్పతి వారం వచ్చింది.
ఉదాహరణ: ౧ ఈ బేస్తవారం కాలేజీకి సెలవు. ౨ బేస్తవారం బాబా గుడికి పొతే మంచిది.
ప్రాంతాలు:
అర్థం:ఏడుపు రాగం.
పుట్టుక: ఏడుపు అనకుండా సరదాగా / కవితాత్మకంగా ఆరునొక రాగం అంటారు. ఆరు + ఒకటి = ఏడు అని
ఉదాహరణ: చిన్నపుడు నేను ఏడుపు మొదలుపెడుతుంటే , మా నాన్న ఆరునొక్క రాగం మళ్ళీ మొదలెట్టావా అని అనేవారు.
ప్రాంతాలు: