జకముక
jakamuka
In English: flint, fire striker — A flint and steel used to strike fire; an old-time lighter.
అర్థం
నిప్పు పుట్టించడానికి వాడే పనిముట్టు. పాత రోజుల్లో లైటర్.
ఉదాహరణ
నాన్న : మా తాత దగ్గర చుట్ట వెలిగించుకోవడానికి జకముక ఉండేది.
పుట్టుక: చెకుముకి రాయి అంటే నిప్పు రాయి. ఒక తోలు సంచిలో జమ్ము దూది, ఇనప బిళ్ళ , చెకుముకి రాయి పెట్టి, ఒక తాడుతో నడుముకి కట్టుకుంటారు. అగ్గి అవసరం వచ్చినప్పుడు ఇనప బిళ్ళ ని రాతిమీద టక్ టక్ అని కొట్టి దూది మీద నిప్పు రవ్వ పడేలా చేస్తారు.

జకముక కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి