సింగినాదం
singinadam 2 అర్థాలు
In English: nonsense, baloney, big fuss, song and dance
అర్థం
అంతా అబద్దం/ అంత విషయం లేదు అని వెక్కిరించడానికి వాడతాం.
Mocking: all nonsense, nothing to it.
ఉదాహరణ
టీవీ లో టెలీమార్కెటరు : ఈ తైలం జుట్టుకి రాస్తే మీ జుట్టు వారంలో నల్లబడుతుంది . పెద్దమ్మ : ఆ ..సింగినాదమేం కాదు !!!
పుట్టుక: పూర్వం పడవలలో సరుకుల రేవుదగ్గరకు వచ్చినప్పుడు కొమ్ముబూర (శృంగనాదం) ఊదేవారు . అయితే మిగతా సరుకులకు లేదా దొంగలు పడవలలో వచ్చినప్పుడు కుడా రేవు దగ్గర కొమ్ముబూర ఊదేవారు. జీలకర్ర పడవలే అంత కంగారు పడనవసరంలేదు అని చెప్పడానికి ఏమి లేదు శృంగనాదం జీలకర్ర అని అనేవారు . రాను రాను అది సింగినాదం జీలకర్ర అయ్యింది.

అర్థం
చిన్న పనికి పెద్ద హడావుడి చేసినప్పుడు ఉపయోగిస్తారు అలాగే అలంకరణ కి ఎక్కువ సమయం తీసుకున్నప్పుడు కూడా వాడతారు
A big fuss over a small task.
ఉదాహరణ
1. ఆఁ గోని సంచి కుట్టడానికి ఎంత సింగినాదం చెత్తన్నావురా నాయనా.. చింపుల్ గా మూతిని గట్టిగ పట్టుకుని వచ్చేసిండానికి..! 2. ఊర్లో పెళ్లిభోజనాలకి ఏళ్ళడానికి చీర కట్టడం కోసం ఎన్ని సింగినాదాలు చేస్తున్నావమ్మా.. చందకోళ్ల కోడలా
సింగినాదం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి