Type in English or తెలుగు

గాంధారి వాన

gandhari vana

In English: torrential rain, blinding rain — Rain so heavy you can't see anything ahead.

అర్థం

కంటికి ఎదురుగా ఏదీ కనపడనంత వర్షం కురిస్తే దాన్ని గాంధారి వాన అంటారు.

పుట్టుక: మహాభారతంలో గాంధారి తన భర్త అయిన దృతరాష్ట్రుడికి కళ్ళు లేని కారణంగా, తాను కూడా కళ్ళకు గంతలు కట్టుకుంది. ఆమె పేరు మీద ముందు ఉన్నది కనపడకుండా పడే వానను గాంధారి వాన అంటారు. అయితే దృతరాష్టుడికి కళ్ళు కనపడవు కదా మరి గాంధారి మీదే ఇది ఉండడానికి కారణం, ఈ వాన అవసరం లేని కాలాలలో పడటమే . కళ్ళు ఉండీ లేనట్టే, ఈ వాన అవసరం లేనప్పుడు, అవసరం లేని చోట పడుతుంది.

గాంధారి వాన కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి