Type in English or తెలుగు

మతాబు

matabu

In English: flowerpot sparkler, sparkler — A Diwali firework held at one end that burns with a bright light.

అర్థం

ఒక సుతను పట్టుకుని, రెండో సుత వెలిగిస్తే పగటి వెలుగు కాంతితో వెలిగే దీపావళి వత్తి.

ఉదాహరణ

నాన్న: ఇంకా సగం పైనే మతాబు గులల్లు ఉన్నాయి. ఇప్పటి దాకా కూరినవి బాగా వెలుగుతున్నాయో లేదో ఒకటి వెలిగించి చూద్దాం.

పుట్టుక: మెహ్ తాబ్ (చంద్రకాంతి) అనే పారశీక పదం నుంచి పూర్వం చంద్రకాంతితో (నీలం రంగులో) వెలిగే వత్తి. ఇప్పుడు సూర్య కాంతితో వెలుగుతుంది. అచ్చ తెలుగు పేర్లు చంద్రజ్యోతి, వెలుగువత్తి.

మతాబు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి