Type in English or తెలుగు

సరం పడటం

saram padatam

In English: food went down the wrong way, choke — When food or water goes up the nose while eating, causing burning and watery eyes.

అర్థం

తినేటప్పుడు ఒక్కోసారి తిన్నది అనుకోకుండా ముక్కులోకి పోతది. మెతుకులు, నీళ్లు అలాంటివి. లోపల చాలా మండుతది. కంటి నుండి నీళ్ళు వస్తయి. దాన్ని *సరం* పడటం అంటం. తల మీద కానీ వీపు మీద కానీ మెత్తగా తడితే పోతది. దీన్నే కొన్ని ప్రాంతాల్లో "పొలమారటం" అంటరు.

ఉదాహరణ

చింటు: ఎందుకే ఏడుస్తున్నవు? చిన్ను: ఏడుస్తలేను చింటూ. ఇంతక ముందు తింటుంటే *సరం* పడ్డది. (చిత్రం pixabay నుంచి)

పుట్టుక: "సరం" అంటే ముక్కుగాలి అనే అర్థం ఉంది.

సరం పడటం
సరం పడటం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి