అంబటి బీరకాయలు
ambati birakayalu ambatalla ఇతర రూపాలు: అంబటాల్ల
అర్థం
నేతిబీరకాయల్ని ‘అంబటి బీరకాయలు’, అంబలి తాగేవేళని అంబటాల్ల అని అంటారు
ఉదాహరణ
ఈ రోజు అంబటి బీరకాయల పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఊరి నుండి వచ్చేసరికి అంబటాల్ల దాటింది.
పుట్టుక: నెయ్యిలాగే అంబలి కూడా ద్రవరూప ఆహారపదార్థం. నెయ్యి మాదిరిగానే స్నిగ్ధంగా ఉంటుంది. అందుకే అదిక్కడ నెయ్యి స్థానంలోకి వచ్చింది. నీ కడుపున అంబలివడ (నీ కడుపులో అంబలి పడనీ) మొదలైన మాటలూ కూడా ఉన్నాయి.
అంబటి బీరకాయలు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి