తాబేటికాయ
tabetikaya
In English: clay water bottle, earthen flask — A turtle-shaped clay bottle for drinking water.
అర్థం
తాబేలు ఆకారంలో ఉండే మట్టితో చేసిన మంచి నీళ్ళ సీసాకాయ.
ఉదాహరణ
తాబేటికాయలో నీళ్ళట్టుకురా.
పుట్టుక: మట్టితో చేసిన తాబేలు ఆకారంలో ఉండి, నారతోడు పట్టీ కట్టి మెళ్ళో వేసుకుని పొలంలో తాగడానికి నీళ్ళు పట్టుకెళ్ళేవాళ్శు. "పాతరోజుల్లో తాబేటి కాయలని నాలుగైదు లీటర్ల నీరుపట్టేవి మట్టితో చేసినవి ఉండేవి. ఇప్పుడు ఎక్కడా కనపట్టం లేదు. తాబేటి కాయలు నిజంగా తాబేలులాగే ఉంటుంది. పీకి సన్నంగా ఉంటుంది, దానికోతాడు కట్టి, నిండా నీళ్ళుపోసుకుని, మూతికి బిరడాగా కఱ్ఱముక్కపెట్టుకుని, చేపాటి కఱ్ఱ చివర తగిలించుకుని భుజాన కఱ్ఱ వేసుకుని చులాగ్గా నడచేవారు. ఇలా భుజాన కఱ్ఱ వేసుకోడం లో మూడవ తులాదండ సూత్రం మనవారు జీవితంలోకి తెచ్చుకున్నారు. మనవాళ్ళకి సయిన్స్ తెలుసా? తెలియదా? ఇప్పుడు మూడవ తులాదండ సూత్రం ఎవరికేనా గుర్తుందా, చెప్పండి? వాడుకుంటున్నారా? ఈ తాబేటి కాయలో నీళ్ళూ చల్లగా ఉండేవి, రైతు రోజంతా వాడుకునేవాడు, వేసవిలో కూడా. ఇప్పుడు ప్లాస్టిక్ సీసాలో మంచినీళ్ళు పట్టికెళ్తే అవి కాస్తా వేడెక్కిపోయి తాగడానికి పనికిరాని పనయిపోయింది. మనవాళ్ళుట్టి పిచ్చాళ్ళు, ప్రకృతితో సహజీవనం చేస్తూ,సుఖంగా బతకడమెలాగో కనుగొన్నారు……" - https://kastephale.wordpress.com/2015/04/03/%e0%b0%b6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%87%e0%b0%aa%e0%b0%82%e0%b0%95%e0%b0%ac%e0%b1%81%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%95%e0%b0%b0/

వ్యాఖ్యలు (–) · రాయండి