నల్లపూస అయిపోవడం
nallapusa ayipovadam
In English: rarely seen, disappeared — Said of someone familiar who hasn't been seen for a while.
అర్థం
ఎవరైనా తెలిసినవారు కొన్ని రోజులగా కనబడకుండా ఉంటే
ఉదాహరణ
ఏంటి శీను, బొత్తిగా నల్లపూసైపోయావు.
పుట్టుక: నల్లపూసలు పెళ్ళైన ఆడవారు మెడలో వేసుకుంటారు. అయితే ఇవి కింద పడితే కనపడవు, దొరకటం కష్టం. అందుకే ఎవరైనా కొన్ని రోజులు కనిపించకపోతే గోదావరి ప్రాంతంలో సరదాగా నల్లపూస అయిపోయావ్ అంటారు.
నల్లపూస అయిపోవడం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి