వార
vara 3 అర్థాలు
In English: corner, side, aside, edge
అర్థం
మూల
A corner or side.
చిత్తూరు · పుంగనూరు
ఉదాహరణ
నాతో మాట్లాడొద్దు. పోయి ఆ వారన కుసో. ( వారలో అని కూడా వాడొచ్చు)
అర్థం
పక్క అని తెల్లం. వారకు - పక్కకు వారగా - పక్కగా
Side; to one side.
చిత్తూరు
ఉదాహరణ
ఈడ నిలబడద్దు, ఆ వారకు పోయి కుచ్చో.
అర్థం
ప్రక్క, మూల, చివర, కొస
The side, edge or corner.
ఉభయ గోదావరి · గ్రామీణ పదజాలం
ఉదాహరణ
1. "రోడ్డు మధ్యలో పెట్టావేటి ఆటో వారకి పెట్టు." 2. "నిన్న ఫంక్షన్ లో కూర్చోవడానికి ఖాళీ లేదు, ఒక వారన నిలబడి చూసాను." 3. "తాడు కొంచెం ఆ వార ఈ వార పట్టుకుని బలంగా లాగు!"
మూల కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో
వార కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి