Type in English or తెలుగు

లక్ష్మి అవుటు

lakshmi avutu

In English: lakshmi bomb, firecracker — A loud Diwali firecracker with a Lakshmi picture on the wrapper.

అర్థం

దీపావళి రాతిరి కాల్చే ఒక టపాకాయ. అట్ట మీద లక్ష్మి దేవి బొమ్మ ఉండేది. ఒత్తు చిన్నదిగా ఉండి , శబ్దం గట్టిగా వస్తుంది.. ఇది కాల్చిచిన్నపుడు మొనగాడిలా అనుకునేవాళ్లం.

ఉదాహరణ

౧ బాబాయి పిన్నితో : ఏమే చూడు రఘుగాడు లక్ష్మి అవుటు వెలిగిస్తున్నాడు . ౨ నాన్న : చిచ్చుబుడ్లు అవ్వగొట్టేయండి, అవుట్లు వేసేద్దాం. సౌండు గట్టిగా వస్తుంది , మల్లా అందరూ పడుకుంటారు.

పుట్టుక: హోవిట్జర్ ( howitzer ) అనే చిన్న ఫిరంగిని వాడుకలో అవుటు అనే వారు తెలుగులో . దాని నుండి ఈ పేరు వచ్చింది .

లక్ష్మి అవుటు
1 Aaakasa Ramanna · 29 Oct 2021
లక్ష్మి అవుటు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి