Type in English or తెలుగు

లక్ష్మీవారం

lakshmivaram

In English: thursday — Thursday.

అర్థం

గురువారం మాట్లాడేటప్పుడు లక్షివారం అని అంటుంటారు

ఉదాహరణ

ఈ లక్షివారం బ్యాంకు సెలవంట. బుధవారం డబ్బులు వేసెయ్యాలి.

పుట్టుక: గురుగ్రహం పేరు మీద గురువారం అనే పేరు వచ్చింది. గురువు బుద్ధి, సంపద మొదలైనవి ఇచ్చే దేవుడు. హిందూ సంప్రదాయం ప్రకారం ఒక్కో వారం ఒక్కో దేవతని పూజించడం వల్ల విశిష్టమైన గుణాలు కలుగుతాయని నమ్ముతారు. లక్ష్మీదేవి కూడా సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం కటాక్షించే దేవత. గురువారం నాడు లక్ష్మీదేవిని పూజించడం వలన అవి సిద్ధిస్తాయని నమ్మకం. అందుకే గురువారాన్ని లక్ష్మీవారం అంటారు. గోదావరి, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ పదం విస్తృతంగా వాడుకలో ఉంది.

లక్ష్మీవారం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి