అర్థం:చెప్పిన మాట వినకుండా నచ్చినట్టు చేయడం. (కృష్ణ, గుంటూరులలో)
పుట్టుక: యతి(సన్యాసి) లాగ తనకి నచ్చిందే చేస్తాడు అని తిట్టడం.
ఉదాహరణ: నానమ్మ: అన్నం తినమంటే ఎందుకు ఎతిమతం పోతావ్? మనవడు: తినాలని లేదు నానమ్మ!! బాబాయి: నువ్వన్నా చెప్పొచ్చు కదరా వాడికి? అబ్బాయి: చెప్తే వింటాడా బాబాయ్! ఎంత ఎతిమతంగా మట్లాడతాడు.
అర్థం:బాసిపీట, బాసిపటం, బాసింపట్టు మటం వేసుకోవడం, అసలుపీట
పుట్టుక: సకలం ముకులం అంటే సంస్కృతంలో అన్ని ముడుచుకోవడం అని.
ఉదాహరణ: ౧) పూజ చేసేటప్పుడు సక్లం ముక్లం ఏస్కొని కూసోవాలి. ౨) నేల మీద సక్లం ముక్లంల కూర్చొని తింటే ఒంటికి చాన మంచిది. 3) సక్లం ముక్లం పెట్టుకొని కూసొండ్రి.