To add a new yaasa word please hit the + sign below.

Raghu Contributions

 అర్థం:     గత సంవత్సరం, పోయిన ఏడాది .
last year.

ఉదాహరణ:  ౧   స్నేహ : నిరుడు వేసవి సెలవులకు పాపి కొండలు వెళ్ళాము. ఈ సారి ఎక్కడికి వెళ్లాలో ఆలోచించాలి.

.౨  నిరుడు ఈ పాటికి వర్షాలు పడ్డాయి.

సహకారి: Raghu
 అర్థం:నిలకడగా ఉండడం.

Be stable ( as a person) , settle.

ఉదాహరణ: ౧  ఎదో ఒక చోట  కుదురుగ ఉండొచ్చుగా.

౨ హిందీ టీచర్: పిల్లలు, గొడవ చేయకుండా కుదురుగా ఉండండి.

3  దేబెట్టటానికి వచ్చిన నాన్న : రూమ్ కి వెళ్లిన తరువాత అంత కుదురుకున్నాక కాల్ చేయి.

౪ కుదురుగా ఉండమ్మ అన్నాను. కుదరదు అన్నావ్. సరే, నీకు నచ్చినట్టే ఉండమన్న


సహకారి: Raghu 20200424
 అర్థం:  ఒకలా  వెక్కిరించటం , సాధారణంగా చంకలు గుద్దుకుంటూ వెక్కిరించటం .


ఉదాహరణ: ఒక పిల్లడు వేరే పిల్లాడిని ఎగతాళి చేస్తూ చంకలు గుద్దుకుంటూ ఇలా అన్నాడు :     అచ్చికిచ్చక , నీకు బాగా అయ్యింది.

సహకారి: Raghu 20200318
 అర్థం: కబడ్డీ ఆట తెలుగు లో.

ఉదాహరణ: 
చెడుగుడు (కబడ్డీ) ఆటలు వస్తున్నాయి TV lo.

సామెత : చెడుగుడు ఆడుకున్నాడు.

Viva లో చెడుగుడు ఆడుకున్నాడు. ఒక్క దానికి కూడా సమాధానం తెలియదు.

సినిమా పాటలు : "చలి చెడుగుడు జెమిని జెమిని తల తిరుగుడు జెమిని"
                           "చెడుగుడు అంటే భయ్యం నాకు" aata

tags:



సహకారి: Raghu 20200416
 అర్థం:     ఏదైనా కింద జారిపడి  ఉపయోగం లేకుండా అవ్వడం.

ఉదాహరణ: ౧ సంచి లో కన్నం వల్ల  బియ్యం అంతా నేలపాలు అయ్యింది.
౨  catch వదిలేయడం తో బంతి నేలపాలు అయ్యింది.


సహకారి: Raghu 20200413