To add a new yaasa word please hit the + sign below.

Raghu Contributions

 అర్థం:పనికి రాని రోజు. Out Of Office.

ఉదాహరణ: తాపీ మేస్త్రి నాన్న తో: నేను రేపు పెళ్ళికి వెళ్ళాలి. నాగా పెట్టేస్తానండి.

ప్రాంతాలు:


సహకారి: Raghu 20211229
 అర్థం:చాలా బాగా పొడవైన

పుట్టుక: కొండవీటి కోటలో నీటి అవసరాల కోసం ౭౪ బావులు తవ్వించారు. ౧౭౦౦ అడుగుల ఎత్తు మీద ఉన్న కోటలో ౧౦౦ ల అడుగుల లోతు నూతులు తవ్వారు. అందులోంచి నీరు తోడటానికి చాలా లావుపాటి పొడవైన చాంతాడు వాడేవారు.

ఉదాహరణ: పెళ్ళికి సరుకుల చిట్టా రాసాం. కొండవీటి చాంతాడంత ఉంది.

సహకారి: Raghu 20211220
 అర్థం:చాలా పొడవైన

పుట్టుక: నూతిలోంచి నీళ్లు తోడటానికి వాడే తాడు చాంతాడు . బాగా పొడవుగా ఉండే వాడిని చాంతాడుతో పోలుస్తారు.

ఉదాహరణ: ఈ సరుకుల చిట్టా ఏంటి చాంతాడంత ఉంది.

సహకారి: Raghu 20211220
 అర్థం:పనులు మెల్లగా చేస్తూ జాప్యం చెయడం

ఉదాహరణ: నాన్న : సాను చెస్తున్నారేంటి, ట్రైను వచేస్తుంది.. తొందరగా తెమలండి.

ప్రాంతాలు:


సహకారి: Raghu 20211201
 అర్థం:అంతా అబద్దం/ అంత విషయం లేదు అని వెక్కిరించడానికి  వాడతాం.

పుట్టుక: పూర్వం పడవలలో సరుకుల రేవుదగ్గరకు వచ్చినప్పుడు కొమ్ముబూర (శృంగనాదం) ఊదేవారు . అయితే మిగతా సరుకులకు లేదా దొంగలు పడవలలో వచ్చినప్పుడు కుడా రేవు దగ్గర కొమ్ముబూర ఊదేవారు. జీలకర్ర పడవలే అంత కంగారు పడనవసరంలేదు అని చెప్పడానికి ఏమి లేదు శృంగనాదం జీలకర్ర అని అనేవారు . రాను రాను అది  సింగినాదం జీలకర్ర అయ్యింది.

ఉదాహరణ: టీవీ లో టెలీమార్కెటరు : ఈ తైలం జుట్టుకి రాస్తే మీ జుట్టు వారంలో నల్లబడుతుంది .
పెద్దమ్మ : ఆ ..సింగినాదమేం కాదు !!!


సహకారి: Raghu 20211120