అర్థం:చేయాలి తప్పదు కాబట్టి ఎదో అయ్యింది అన్నట్టు పని పూర్తి చేయడం.
ఉదాహరణ: ఈవేళ presentation సరిగ్గా చేయలేదు. ఎదో తూతూమంత్రంగా కానిచేసా.
అర్థం:sling పొలంలో పిట్టలను కోతులను తరుముతానికి వాడే సాధనం. ఒక చిన్న వల కి రెండు కొసలు కట్టి , ఆ వలలో రాయి పెట్టి , రెండు కొసలు చేతితో పట్టుకుని గిరగిరా తిప్పి ఒక కోసం వేదిలేస్తారు. అప్పుడు రాయి వేగంగా పడుతుంది.
ఉదాహరణ: నూర్పిళ్ళు అయిపోతున్నాయి కదా , రేపు పొలం లో మంచె ఎక్కి కాకులు గువ్వలు వచ్చి మొక్కజొన్నలు తినకుండా వడిసెలతో తరమాలి.
అర్థం:పొగబెట్టిన చేప , smoked fish
పుట్టుక: ఎండు చేపలు, ఉప్పు చెప్పులు లాగానే ఆర్చిన చేపలు. సాధారణంగా చేపలను ఎండబెట్టి నిలవ ఉంచుతారు. అయితే కొన్ని పెద్దచేపలు పూర్తిగా ఎండవు అందుకే ఉప్పు వాడతారు. వాటినే ఉప్పుచేప అంటారు. ఎండ బదులు కట్టెల మీద ఈ పొగబెట్టిన చేపలు చేస్తారు. వీటినే చప్పిడి చేప అని కూడా అంటారు.
ప్రాంతాలు: